రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపెవరిదో తేలిపోయిందని నేను పోటీ నుంచి తప్పుకోవాలా?: మీరా కుమార్ ప్రశ్న

02-07-2017 Sun 08:27 | National
17 ప్రతిపక్ష పార్టీల అండతో రాష్ట్రపతి రేసులో నిలిచిన మీరా కుమార్ మీడియాకు ఝలక్కిచ్చారు. గెలుపునకు అవసరమైన సభ్యుల మద్దతు లేని తాను పోటీ నుంచి తప్పుకోవాలా? అని ప్రశ్నించి ఉక్కిరిబిక్కిరి చేశారు. శనివారం బెంగళూరులోని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు, జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ దేవగౌడలను కలిసిన మీరా కుమార్ వారి మద్దతు కోరారు. అనంతరం మీడియా ఇష్టాగోష్ఠిలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా.. బీజేపీ నిలబెట్టిన రామ్‌నాథ్ కోవింద్‌కు చాలా మంది సభ్యుల మద్దతు ఉందని, ఈ విషయం తెలిసీ మీరెందుకు పోటీలో నిల్చున్నారన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు మీరా కుమార్ స్పందిస్తూ.. "ఇదే ప్రశ్నను నన్ను ప్రతి చోటా అడుగుతున్నారు. అసలు ఇప్పటికే విజేత ఎవరో తేలిపోతే కనుక, ఇక ఎన్నిక ఎందుకు నిర్వహిస్తున్నారో చెప్పండి?" అంటూ ఆమె ఎదురు ప్రశ్నించారు.

అనంతరం ఆమె కొనసాగిస్తూ.. తన ఎన్నికల ప్రచారం సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభమైనట్టు చెప్పారు. గాంధీ సిద్ధాంతాలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ‘‘నాకు సరిపడా మద్దతు లేదన్న ఒకే ఒక్క కారణంతో బరి నుంచి తప్పుకోమంటారా? నేను ఎన్నికల్లో పోటీ చేయడం మీకు ఇష్టం లేదా?’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ తనను బలిపశువును చేసిందన్న వ్యాఖ్యలను కొట్టి పడేసిన మీరా కుమార్.. రాష్ట్రపతి ఎన్నిక ఇద్దరు దళితుల మధ్య పోరుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా విచారకరమన్నారు. చదువుకున్న వారు కూడా రాష్ట్రపతి ఎన్నికలకు కులం రంగు పులమడం బాధాకరమన్నారు.

More Telugu News

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55
..more